99 రూపాయలు లేకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా..?’

99 రూపాయలు లేకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా..?’ 

–  శ్రీనివాస్ గౌడ్

– ‘నిధులు లేకుండా ప్రణాళికలు ఎలా

– రామన్నపేట సమావేశంలో సర్పంచుల ఫైర్ 

మండలంలో నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బిఆర్‌ఎస్, ఇతర ప్రతిపక్ష సర్పంచులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ మాట్లాడుతూ గ్రామాలకు నిధులు ఇవ్వకుండా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలంటూ ప్రశ్నించారు. “99 రూపాయలు కూడా ఇవ్వకుండా 99 రోజుల ప్రణాళిక ఎలా అమలు చేస్తాం..?” అని నిలదీశారు. మహిళా సంఘ భవనాల కేటాయింపులో అధికార పార్టీ గ్రామాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.వెల్లంకి, సిరిపురం, బోగారం, ఇంద్రపాలనగరం, పల్లివాడ, లక్ష్మాపురం, దుబ్బాక, మునిపంపుల, కుంకుడు పాముల గ్రామాలకు తీర్మాన కాపీలు ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో పారదర్శకత లేకపోవడంపై సర్పంచులు మండిపడ్డారు. గ్రామ పంచాయతీల్లో కుర్చీలు, టేబుళ్లు నుంచి కరెంటు బిల్లుల వరకు సొంతంగా భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ గ్రామంలో కరెంటు సమస్యలు, ఐకేపీ సెంటర్ల ప్రారంభోత్సవాలకు సర్పంచులను పిలవకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో సర్పంచులను పక్కన పెడుతున్నారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై స్పెషల్ అధికారి శ్రీమతి సాహితి స్పందిస్తూ అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సమావేశం మొత్తం అధికారుల తీరుపై అసంతృప్తి, ఆగ్రహంతో ముగిసింది. కార్యక్రమంలో తాసిల్దార్ లాల్ బహుదూర్,ఎంపీడీవో రాములు, ఎస్ఐ నాగరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking