మరిచిపోయిన మొబైల్‌ను భక్తునికి అప్పగింపు
యాదాద్రి భువనగిరి అక్షిత బ్యూరో
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి దర్శనార్థం వచ్చిన హైదరాబాద్‌కు చెందిన మహేష్ తన మొబైల్ ఫోన్‌ను కొండపై బస్‌స్టాప్ వద్ద మరిచిపోయాడుఅక్కడే విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది శేఖర్ ఆ ఫోన్‌ను గుర్తించి, మైక్ ద్వారా ప్రకటన చేయించి భక్తుని వివరాలు సేకరించారు. అనంతరం మొబైల్ ఫోన్‌ను మహేష్‌కు సురక్షితంగా అప్పగించారు. తన మొబైల్ తిరిగి లభించడంతో భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది శేఖర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఎస్వీఎఫ్ సిబ్బంది, సహచరులు, భక్తులు శేఖర్ నిజాయితీని అభినందించారు.