ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం..

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం..

విరిగిన కుర్చీలపై సమావేశం 

భయంతో కూర్చున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో అవ్యవస్థలు వెలుగుచూశాయి. సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులకు ఏర్పాటు చేసిన కుర్చీలు పూర్తిగా దెబ్బతిన్నవిగా ఉండటం విమర్శలకు దారితీసింది.మీటింగ్ హాల్లో ఉంచిన పలుచోట్ల ప్లాస్టిక్ కుర్చీలు విరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ, వాటినే వినియోగించాల్సి రావడంతో హాజరైనవారు అసౌకర్యానికి గురయ్యారు. కుర్చీలు ఎప్పుడు విరిగిపోతాయోనన్న ఆందోళన మధ్య సమావేశంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రభుత్వ కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశానికి కనీస సదుపాయాలు లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking