ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత

ప్రజాపాలన సమావేశంలో ఉద్రిక్తత

టీఆర్‌ఎస్–కాంగ్రెస్ సర్పంచుల మధ్య వాగ్వివాదం

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.టీఆర్‌ఎస్ సర్పంచులు ప్రభుత్వ కార్యక్రమాలపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, గౌరవం దక్కడం లేదని అధికారులను ప్రశ్నించగా, కాంగ్రెస్ సర్పంచులు ప్రతిస్పందించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు, పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సమావేశం కొనసాగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking