మృతుని కుటుంబానికి అండగా నిలిచిన బీజేపీ నేత తుమ్మలపల్లి

మృతుని కుటుంబానికి అండగా నిలిచిన బీజేపీ నేత తుమ్మలపల్లి

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

ఇటీవల వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెద్దమాం తిరుపతయ్య మృతి చెందగా అంతకుముందే అతని భార్య పెదమాం రేణుక అనారోగ్యంతో చనిపోవడంతో మృతుల ఇద్దరు ఆడపిల్లలు పల్లవి, భార్గవి కుటుంబ పెద్దలు చనిపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ బీజేపీ పట్టణ అధ్యక్షులు తుమ్మలపల్లి హనుమంతరెడ్డి మంగళవారం మృతుల పెద్ద కుమార్తె పల్లవి పుట్టినరోజు కావడంతో తిరుపతయ్య కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుక నిర్వహించడం జరిగింది.అనంతరం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. అంతేకాకుండా రెండవ కుమార్తె భార్గవి ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసేందుకు కేఎల్ఎన్ కళాశాలలో ఉచిత విద్య వసతి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ నాయకులు పెదమాం వెంకన్న, పెదమాం భరత్, మేడి నవీన్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking