విద్యార్థుల కృషితోనే కాంగ్రెస్ గెలుపు

విద్యార్థుల కృషితోనే
కాంగ్రెస్ గెలుపు

ఘనంగా ఎన్ఎస్ యుఐ 54 వ ఆవిర్భావ దినోత్సవం

జెండాను ఆవిష్కరించిన బొంగర్ల వినోద్

వేములపల్లి, అక్షిత ప్రతినిధి :

ఎన్ఎస్ యుఐ 54 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం వేములపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎన్ఎస్ యుఐ రాష్ట్ర నాయకులు బొంగర్ల వినోద్ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ఎస్ యుఐ నాయకులు కార్యకర్తలు, ముఖ్యపాత్ర పోషించారని,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరింత బలంగా పని చేసి 14 పార్లమెంట్ స్థానాలను గెలిపించేందుకు సైనికుల్లా పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ జిల్లా వైస్ చైర్మన్ పుట్టల శ్రీను, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అమిరెడ్డి రాంరెడ్డి, మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ హజి, ఎన్ఎస్ యుఐ నాయకులు పెదపంగ రాము, పగడాల వెంకన్న, పుట్టల సుధాకర్, పల్లె సైదులు, పగడాల శ్రీను, దైద శ్రీకాంత్, బన్నీ, పుట్టల సైదులు, దర్శనపు సైదులు, కృష్ణయ్య, చంద్రయ్య, సులేమాన్, కన్నయ్య, లాలమ్మ, రమణ, మల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking