వీసీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి

వీసీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి

*బిసి సంక్షేమ సంఘం నేత లింగంగౌడ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నూతన వైస్ చాన్స్ లర్లను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సామాజిక న్యాయం పాటీంచి జనాభాలో 55 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఐదు యూనివర్సిటీ లకు వైన్ ఛాన్స్ లర్లుగా నియమించాలని కోరుతూ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ పంపినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించి నీతి, నిజాయితీ కలిగిన వారిని వీసీలుగా నియమించి విశ్వవిద్యాలయాల ప్రతిష్టను కాపాడాలన్నారు. బంధుప్రీతి, రాజకీయ అండదండలు ఉన్న వారిని గాకుండా ఉన్నత విలువలు గలవారిని నియమించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking