బాధిత కుటుంబాలకు రవీణ కరుణాకర్ రెడ్డి భరోసా
రూ.12వేలు ఆర్థిక సహాయం
వేములపల్లి, అక్షిత న్యూస్:
మండలంలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన జేరిపోతుల స్టాలిన్, దేవరకొండ శ్రీనులు ఇటీవల జరిగిన వేరువేరు ప్రమాదాలలో గాయపడి చికిత్సపొందుతున్నారు.ఇరువురు చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నా విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మాజీ ఎంపిపి నామిరెడ్డి రవీణకరుణాకర్ రెడ్డి గురువారం జేరిపోతుల స్టాలిన్, దేవరకొండ శ్రీనులు మెరుగైన చికిత్స చేయించుకొనుటకు ఒక్కొక్కరికి రూ.6000 చొప్పున ఇద్దరికీ రూ.12,000 లు ఆర్థిక సహాయము అందజేశారు.

ఈ కార్యక్రమంలో కానుగు రాములు ప్రవీణ్ రమణాల సతీష్, సురేందర్, నాగరాజు, సైదులు, అరవింద్, తిరుమల్ మధు సైదులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.