ధరణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ధరణి ఫిర్యాదులను పరిష్కరించాలి

కలెక్టర్ నారాయణ రెడ్డి

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

ధరణి,ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం అయన దామరచర్ల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన ధరణి దరఖాస్తుల పరిష్కారంతోపాటు, ప్రజావాణి పిటిషన్ల పరిష్కారాన్ని పరిశీలించారు .ధరణిలో దరఖాస్తులను ఎలా పరిష్కరిస్తున్నది సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అంతేగాక తహసిల్దార్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని సంరక్షించడంలో తహసిల్దార్ చొరవను అభినందించారు. ముఖ్యంగా ఆరు కోట్ల రూపాయల విలువ చేసి ప్రభుత్వ భూమి చుట్టూ కంచవేసి రక్షణ చర్యలు చేపట్టడం పట్ల ఆయన అభినందించారు.

జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ ఆర్డీవో శ్రీనివాసరావు, దామరచర్ల తాసిల్దార్ జవహార్ లాల్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking