సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఎండీ.యూసుఫ్ కోరారు. సోమవారం స్థానిక కార్యాలయంలో ఎఎన్ఎం, ఆశావర్కర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలో దోమల నివారణ చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. పట్టణంలో పారిశుధ్య కార్యక్రమాలు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆధ్వర్యంలో ప్రత్యెక కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. దోమల నివారణకు ఫొగింగ్, మురికి గుంతల్లో ఆయిల్ భాల్స్ వేయడం జరుగుతుందన్నారు. అతిసార, డెంగ్యూ, ఇతర జ్వరాల బారిన ప్రజలు పడితే వెంటనే వైద్య సహాయమందించాలని ఆయన కోరారు. సమావేశంలో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్లు నిపుణ, సంజయ్, సిహెచ్ఓ ప్రభాకర్, విద్యుత్ ఎఇ వెంకట్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, మెప్మా టీఎంసి భక్కయ్య, సిఓ ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.