కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

బిజెపి మండల అధ్యక్షులు చిర్ర సాంబమూర్తి యాదవ్

వేములపల్లి, అక్షిత న్యూస్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వేములపల్లి మండల బిజెపి అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షత జరిగిన బిజెపిమండల కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. భారతీయ జనతా పార్టీని బూతు స్థాయి నుంచి బలోపేతం చేసి రానున్న స్థానిక ఎన్నికలలో విజయం సాధించమే లక్ష్యంగా ముందుకు పోవాలన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యడ్ల రమేష్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదమాం వెంకన్న, బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి పెదమాం భరత్, శివ, భాగ్యమ్మ, ప్రభాకర్, మహేష్, శ్రీరాంమోజు రవి, రమేష్ రెడ్డి, లక్ష్మి, హరికృష్ణ, తోట మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking