డా. అమరేందర్ రెడ్డిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
“కృత్రిమ మేద ద్వారా వచ్చే న్యాయపరమైన, నైతికపరమైన చిక్కులు” అనే అంశంపై పిహెచ్ డి పూర్తి చేసిన నల్గొండ ఎంపిపిఎస్ డా. అమరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందించారు. ఇలాంటి పరిశోధనలు మరిన్ని అవసరమని, కృత్రిమ మేద ద్వారా వచ్చే పరిణామాలు తీవ్రతరంగా ఉన్నందున ఇలాంటి అంశాలపై పరిశోధన కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. డా. అమరేందర్ రెడ్డి ఇప్పటికే అనేక సామాజిక మరియు న్యాయపరమైన అంశాలపై 16 పరిశోధన పత్రాలు వ్రాయగా, ఇవి వివిధ జాతీయ అంతర్జాతీయ జర్నల్లల్లో ప్రచురితమయ్యాయి. న్యాయ శాస్త్రంలో కృత్రిమ మేదద్వారా వచ్చే న్యాయ పరమైన చిక్కులకు మరియు వాటి పరిష్కారానికై అంతర్జాతీయ సాంకేతిక చట్టాల ఏర్పాటు చేయాలనే అంశంపై ఇదే మొదటి పిహెచ్ డి కావటం విశేషం. ఈ సందర్బంగా డా. అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ, కృత్రిమ మేదను న్యాయపరంగా క్రమబద్దీకరణ చేయకపోతే, ఇప్పటికే రోజా రోజు కు సైబర్ క్రైమ్ నేరాలు విపరీతంగా పెరిగిపోవటం (సుమారు 200 % ప్రతి ఏటా పెరుగుతూ అనేకమంది సామాన్యులు కూడా బలి అవుతున్నారని, బాధితులకు న్యాయం కల్పించటంలో మాత్రం 5 % కంటే తక్కువ ఉండటం, వ్యక్తిగత గోప్యత, భద్రత, అల్గారిథమిక్ పారదర్శకత, సైబర్ సెక్యూరిటీ దుర్బలత్వాలు, అన్యాయం, పక్షపాతం మరియు వివక్ష, పోటీతత్వం లేకపోవడం, చట్టపరమైన వ్యక్తిత్వ సమస్యలు, మేధో సంపత్తి సమస్యలు, కార్మికులపై ప్రతికూల ప్రభావాలు, గోప్యత మరియు డేటా రక్షణ సమస్యలు, నష్టానికి బాధ్యత మరియు జవాబుదారీతనం లేకపోవడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ఇప్పటికే 86 కోట్ల భారతీయుల వ్యక్తిగత సమాచారం శత్రు దేశాలనుండి దొంగిలించబడ్డదని, మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత, రాజకీయ డేటా చోరీ కాబడ్డదని, అమెరికాలో డ్రైవర్ రహిత కార్ల ప్రయాణాల్లో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆటోమాటివ్ ముఖ గుర్తింపు సిస్టం ద్వారా దాదాపు 23 వేల మంది అమెరికా, కెనడాలోకి ఇతరదేశీయులు చొరబడ్డారు, మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ భద్రతా విభాగానికి సంబంధించి డేటా చోరీ మరియు వెబ్ సైట్ హక్కింగ్ ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని గుర్తు చేశారు. డిసెంబర్ 2023 లో న్యూ ఢిల్లీ లో జరిగిన అంతర్జాతీయ కృత్రిమ మేద సదస్సులో కూడా ప్రధాని మోడీ కూడా ఈ సమస్యలకు పరిష్కారం అంతర్జాతీయ సాంకేతిక చట్టాల ఏర్పాటు ఒక్కటే మార్గం అని పేర్కొన్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క, మాజీ సీనియర్ మంత్రి, మాజీ తెలంగాణ ప్రతిపక్ష నాయకులు జానా రెడ్డి పాల్గొన్నారు.