వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

 

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి

గోదావరి ఉదృతిపై నిరంతరం నిఘా పెట్టండి..

రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న
వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో వరద పరిస్థితిని సమీక్షించారు.
జిల్లా యంత్రాంగం సహాయ పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల తోపాటు గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరివాహ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా రెస్కూటీమ్‌లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల ను వినియోగించాలని అధికారులకు సూచించారు.

లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. .
జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని తెలియచేశారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని మంత్రి అన్నారు.ముఖ్యంగా గోదావరి ఉధృతి పై నిరంతరం మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking