*మల్కాజిగిరి, అక్షిత ప్రతినిధి :
ఎస్ టి,ఎస్ సి అణగారినవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఆదినారాయణ అని పలువురు ఎస్టి,ఎస్సి, సామాజిక సంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం మల్కాజిగిరిలో కీర్తిశేషులు ఆదినారాయణ సంతాప కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పలు కుల సంఘం నాయకులతో పాటు అధికారులు,రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఆదినారాయణకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదినారాయణ గిరిజన సంక్షేమశాఖలో జిల్లా స్థాయి అధికారిగా పనిచేసి గిరిజన జాతి తో పాటు ఎస్సీ, అణగారిన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం కృషిచేసిన వ్యక్తి ఆదినారాయణ అన్నారు.35 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమందికి తన సేవలను అందించారని వారి సేవలను నేటి యువత,ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గిరిజన జాతులు ఆదర్శంగా తీసుకుని వారి ఆశయాలను కొనసాగించాలన్నారు.

వారు లేని నోటు వారి కుటుంబ సభ్యులతో పాటు గిరిజన జాతికి తీరనిదని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్ పి శ్రీనివాస్,డిఐజి వెంకటేశ్వర్లు,సెంట్రల్ లేబర్ కమిషనర్ శ్రీనివాసరావు,ఎం అర్ పి ఎస్ జాతీయ కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ,ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ జిల్లా నాయకులు విజయ రావు మాదిగ ఎంజీఎఫ్ రాష్ట్ర నాయకులు అశోక్, జాతీయ ఎస్ టి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు టీవీ రమణ,ఆల్ ఇండియా ఎస్టి ఎంప్లాయిస్ నేషనల్ కోఆర్డినేటర్ నాగార్జున, ఆంధ్రప్రదేశ్ నుండి కే బ్రహ్మయ్య, న్యాయవాదులు శ్రీధర్, కాంట్రాక్టర్ రాములు, వివిధ పార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.