చెర్వుల్లోకి సాగర్ నీరు

చెర్వుల్లోకి సాగర్ నీరు

అన్ని చెర్వులు నిపేందుకు యోచన

రైతులెవరూ నీటిని మల్లించొద్దు

కలెక్టర్ నారాయణ రెడ్డి
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

నాగార్జున సాగర్ నీటితో జిల్లాలోని అన్ని చెరువులు నింపనున్న దృష్ట్యా రైతులెవరు సాగునీటిని మళ్ళించుకోకూడదని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు.

శనివారం ఆయన నాగార్జునసాగర్ నీటి వినియోగంపై రెవెన్యూ, పోలీస్,ఇరిగేషన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా రాష్ట్ర మంత్రులు శుక్రవారం సాగునీటిని విడుదల చేసిన దృష్ట్యా శనివారం నుండే జిల్లాలోని అన్ని ట్యాంకులను నీటితో నింపనున్నట్లు చెప్పారు. ఎడమకాలువ ద్వారా 10 నుండి 11 వేల క్యూసెక్కుల నీటిని వదులడం జరుగుతున్నదని , ఎక్కడైనా చెరువులు, కుంటలు తెగి పోయేందుకు లేదా గండ్లు పడేందుకు ఆస్కారం ఉంటే ముందే గుర్తించి తక్షణమే వాటిని అరికట్టాలని అన్నారు. ముఖ్యంగా రైతులెవరు సాగునీటిని తొందరపడి మళ్లించుకోవద్దని,వారం రోజుల్లో అన్ని ట్యాంకులను నింపుతామని కోరారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని చెరువులన్నిటిని ఒకటికి రెండుసార్లు తిరిగి పరిశీలించి ఎక్కడైనా తెగిపోయేందుకు ఆస్కారం ఉన్న చెరువులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని, ఈ విషయాన్ని ముందే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు.నిర్దేశించిన ఆయకట్టు వరకు సాగునీరు వెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో స్థానిక ఇంజనీరింగ్ అధికారులు, అలాగే మండల బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. లస్కర్ లందరూ కాల్వపై అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క చెరువు తెగిపోవడానికి వీలులేదని, ఎంపీడీవో, తహసిల్దార్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్లు సాగర్ నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో ముఖ్యపాత్ర వహించాలని, అదేవిధంగా ఆర్డీవోలు, డిఎస్పీలు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శుల ద్వారా ఎప్పటికప్పుడు సాగునీటిని పర్యవేక్షణ చేయాలని ,సాగు నీరు ఎక్కడ దారి మల్లకుండా చూడాలన్నారు. సంవత్సరం తర్వాత నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా విడుదల చేయడం జరుగుతున్నదని అందువల్ల రైతులు పంటలు పండించుకునేందుకు ఒక చక్కని అవకాశం అని, సాగునీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో రైతులతోపాటు, ఇంజనీరింగ్, రెవిన్యూ ,పోలీస్ అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు.

జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ సాగినీటి సక్రమ నిర్వహణకు గాను పోలీస్ శాఖ తరఫున అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని, అంతేకాక బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండల స్థాయిలో ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందేలా సహకరించాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎడమ కాలువ నుండి సాగునీటి విడుదలను ప్రతిరోజు పెంచుకుంటూ పోతామని తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, ఆర్డీవోలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking