30 ఏళ్ళ కల… ఫలించిన వేళ

*30 ఏళ్ళ మంద కృష్ణ పోరుకు ఫలితం ఈ తీర్పు*

ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి, ఎంజెఎఫ్ ఇంచార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ

*మాదిగల కలను నెరవేర్చిన మోడీ*
*కార్పొరేటర్ రాజలక్ష్మి*
మల్కాజిగిరి, అక్షిత ప్రతినిధి :

30 సంవత్సరాల అల్పరుగని పోరాట యోధులు మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ కార్యదర్శి, మాదిగ జర్నలిస్టు ఫోరం జాతీయ ఇన్చార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ అన్నారు.శుక్రవారం మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పైసలు కోర్టు తీర్పును సాగదీస్తూ మాదిగ జర్నలిస్టు ఫోరం మల్కాజిగిరి జిల్లా ఇంచార్జ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తిప్పారపు లక్ష్మణ మాదిగ, వినాయక నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు రామచందర్ మాదిగ, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎన్ వినయ్ లు పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ 70 సంవత్సరాల ఆకాంక్షల 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో కేంద్ర ప్రభుత్వం,ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు కోసం కమిటీని వేసి వేగవంతం చేసిన మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల అలుపెరుగని పోరాటం ఈ విజయాన్ని చేకూర్చిందని చెప్పారు. అంబేద్కర్ సాగించిన రిజర్వేషన్ ఫలాలు అందరికీ పంచడమే ఈ తీర్పు ఉద్దేశం అని పేర్కొన్నారు. 30 సంవత్సరాల తన జాతి కోసం పోరాటం చేసిన 30 సంవత్సరాల తన జాతి కోసం పోరాటం చేసి ఎన్నో కష్టనష్టా లను ఎదుర్కొని భారత ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఒప్పించి తన సామాజిక వర్గాల మీటింగ్లో భాగంగా నరేంద్ర మోడీ నోటితో ఎస్సీ వర్గీకరణ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అతి త్వరలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట తీసుకుని ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఆటంకం లేకుండా తీర్పు తీసుకువచ్చిన మహా నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అదే మాట ప్రకారం నరేంద్ర మోడీ తీర్పుతోందాగా వచ్చేందుకు కమిటీని వేసి సహకరించినందుకు ఎస్సీ ఎస్టీల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని లక్ష్మణ్ చెప్పారు. కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలు రాజ్యాంగ పాలాలను సమానంగా పంచుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరికీ న్యాయం చేసేందుకు ముందుకు వెళుతుందని ఈ తీర్పు ఉదాహరణ అని తెలిపారు. సామాజిక న్యాయానికి కట్టుబడి బిజెపి ప్రభుత్వం మోడీ నాయకత్వంలో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారని మాదిగల ఉద్యమస్ఫూర్తి ఎంతో గొప్పదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ రాష్ట్ర నాయకులు జాన్, జన్ను నరేష్, తుపాకుల రమేష్, ప్రభాకర్, వినయ్,అభి,బిజెపి నాయకులు ఓం ప్రకాష్,సాయి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking