సమాజ సేవల్లో ముందుండాలి

సమాజ సేవల్లో ముందుండాలి

లయన్ అశోక్ స్వైన్
సేవలు విశిష్ఠo

డిస్ట్రిక్ గవర్నర్ లయన్ మనోహర్ రెడ్డి

సికింద్రాబాద్, అక్షిత ప్రతినిధి :
సమాజ సేవల్లో లయన్స్ ముందుండాలని డిస్ట్రిక్ గవర్నర్ లయన్ ఎన్.మనోహర్ రెడ్డిఆకాంక్షించారు. మంగళ వారం రాత్రి ప్యారడైజ్ సర్కిల్ లోని లయన్స్ భవన్ లో 320హెచ్ జిల్లాలోనే అతి పెద్ద క్లబ్ అయిన 141 మందితో అత్యంత ఎక్కువ సభ్యత్వం కలిగిన లయన్స్ క్లబ్ ఆఫ్ హైదారాబాద్ నోబెల్ ప్రమాణ స్వీకారోత్సవo అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ లయన్ మనోహర్ రెడ్డి క్లబ్ నూతన కమిటీతో ప్రమాణస్వీకారం చేయించారు.

320 హెచ్ గవర్నర్ అయిన లయన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సేవల్లోనే మేటిగా లయన్స్ సేవలు ఉండాలన్నారు. పేదలకు విశిష్ట సేవలందించ డంలోనే లయన్స్ అగ్రభాగాన నిలుస్తున్నారన్నారు. ఇప్పటి వరకు సేవలందించిన అశోక్ కుమార్ స్వైన్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నోబుల్ తో తనకున్న సంబంధాన్ని గుర్తు చేశారు. డిస్ట్రిక్ట్ లోనే అతి పెద్ద క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ డిస్ట్రిక్ట్ లోనే మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.క్లబ్ యొక్క నూతన సభ్యులందరిని ప్రత్యేకంగా అభినందించారు.

కొత్త సభ్యులను ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ఇంపాక్ట్ ఫౌండర్ అండ్ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ లయన్ గంపా నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు.

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నోబెల్ చార్టర్ ప్రెసిడెంట్, ప్రస్తుత జిఎస్టి అయిన లయన్ అశోక్ కుమార్ స్వైన్ క్లబ్ విశిష్టతను వివరించారు.

గత కమిటి చేసిన కార్యక్రమాలన్నీ వివరించడం జరిగింది. నూతన క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికైన మల్లేష్ తన యాక్సెప్టెన్ స్పీచ్ ని ఇచ్చి క్లబ్ ని మరింత ఉన్నత స్థితికి తీసుకు వెళ్తానని చెప్పడం జరిగింది. జోనల్ చైర్ పర్సన్ లయన్ రజనీకాంత్ కోక మాట్లాడుతూ క్లబ్ చేసిన పర్మనెంట్ ప్రాజెక్ట్స్ గురించి వివరించి మరిన్ని కార్యక్రమాలు క్లబ్ ద్వారా జరుగుతాయని, నా సహాయం ఎప్పుడూ క్లబ్ ఉంటుందన్నారు. మాజీ జిల్లా గవర్నర్లు లయన్ జితేందర్ కుమార్, లయన్ లింగారెడ్డి, లయన్ రవీంద్రనాథ్ గుప్త, లయన్ ఆవుల గోపాలరావులు మాట్లాడుతూ లైన్ అశోక్ కుమార్ స్వైన్ సేవలను ఆయన జిల్లాకు చేసిన విశిష్ట సేవలను అభినందించారు.

ఫస్ట్ వైస్ డిస్టిక్ గవర్నర్ లయన్ గంప నాగేశ్వరరావు మాట్లాడుతూ 141 మెంబర్స్ తో జిల్లాలోనే అతి పెద్ద క్లబ్ అయిన లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ మరింత మందిని సభ్యులుగా చేర్చుకుపోతుందని మరిన్ని సమాజ సేవా కార్యక్రమాలు పర్మిట్ ప్రాజెక్ట్స్ చేయాలని క్లబ్ ని ఉద్దేశించి ప్రసంగించారు. క్లబ్ యొక్క నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆఫ్ సెర్మనీగా లయన్ జనపరెడ్డి రవీందర్, షకీలా అహ్మద్ లు వ్యవహరించారు.

అత్యంత ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన అందరికీ లయన్ అశోక్ కుమార్ స్వైన్, నూతన ప్రెసిడెంట్ లయన్ మల్లేష్ ధన్యవాదాలు తెలిపారు. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ విశ్వేశ్వర రావులు మాట్లాడుతూ క్లబ్ తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ లయన్స్ అశోక్ కుమార్ స్వైన్ చేస్తున్న, చేసిన కార్యక్రమాలంటిని అభినందించి క్లబ్ యొక్క నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. రాజా ఇన్ ఫ్రా డెవలపర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking