అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడొద్దు

 

మంత్రి సీతక్క పై అహంకారంగ మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి*

*- అహంకారంతో అడ్డగోలుగా మాట్లాడవద్దు…*

*- కౌశిక్ రెడ్డి దురహంకారం మాటలు మానుకో లేదంటే ప్రజలే బుద్ది చెప్తారు…*

*- నీ వ్యక్తిత్వంతోనే ప్రజలు నికు బుద్ధి చెప్పిన వారిని మభ్యపెట్టి ఓటు వేయకపోతే భార్య బిడ్డలతో ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించి ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచావు….*

*- కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నోముల ధనమ్మ యాదగిరి*

నకిరేకల్ అక్షిత ప్రతినిధి :

మంత్రి సీతక్క పై అహంకారంగ మాట్లాడిన పాడి కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నోముల ధనమ్మ యాదగిరి డిమాండ్ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ పాడి కౌశిక్ నీకున్న అజ్ఞాన బుద్ధితో అసెంబ్లీలో ఒక మహిళా మంత్రి ప్రజా సేవకురాలు తెలంగాణకే కాదు భారతదేశంలో కూడా ఆదర్శ మహిళా మంత్రి సీతక్క పై జ్ఞానం లేకుండా మాట్లాడిన దానికి ప్రతిఫలంగా నీ నియోజకవర్గ మహిళా ప్రజలు నీకు బుద్ధి చెబుతారు.సీతక్క అంటే ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుంది. ప్రాణాలకు తెగించి సాహసం చేస్తూ ప్రజలకు ధైర్యం చెప్పి తన వంతు సాయం చేస్తుంది.
రాజకీయాలకతీతంగా పనిచేస్తూ ప్రజల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిపై ఇలాంటి మాటలు మాట్లాడడం అది నీ నైజం కావచ్చు. కానీ సీతక్క ప్రజల శ్రేయస్ కోసం పని చేస్తారు అని అన్నారు.కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నీకు ఎమ్మెల్యే పదవి వస్తే ఏం మాట్లాడాలో తెలియక గొప్ప మహిళా మంత్రిపై ఈ విధంగా అసభ్యంగా ఆఫ్ నాలెడ్జ్ తో మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking