గాదరి కిషోర్ …నోరు అదుపులో పెట్టుకో

*గాదరి కిషోర్ …నోరు అదుపులో పెట్టుకో …ఖబర్దార్*

*దొంగ నోట్ల దొంగవి నువ్వు నీతులు చెప్తున్నావా*

*టి పి సి సి రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్*

తుంగతుర్తి, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై దొంగ నోట్ల దొంగ గాదరి కిషోర్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అనుచిత వ్యాఖ్యలు వెంటనే విరమించుకొని భేషరతుగా క్షమాపణలు చెప్పాలని టీ పీసీసీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ యుగంధర్ డిమాండ్ చేశారు.

ఆదివారం యుగంధర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ దొంగ నోట్ల ముద్దాయి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. అక్కడ ఉన్నది వెంకట్ రెడ్డి నీలాగా అక్రమాలు అత్యాచారాలు చేసిన వారు కాదు బిడ్డ మళ్ళీ నోరు జారితే నాలుక చిలుస్తాం అని విమర్శించారు.
ప్రభుత్వ పాలనలో ఏవైనా లోపాలు ఉంటె ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు లోపాలను ఎత్తి చూపి వాటిని మార్చుకునే విదంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తే స్వాగతిస్తాం అని మా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నా వినకుండా అవినీతి చేసి సంపాదించినా డబ్బు మదంతో ఉన్న బి ఆర్ఎస్ నాయకులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతుండడం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గమనిస్తున్నట్లు అన్నారు.
మీరు సక్కగా పాలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయేవాళ్లు ఎంపీ ఎన్నికల్లో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేని మీరు ప్రజాపాలన చేస్తున్న ప్రభుత్వం పై మంత్రులపై తీవ్రమైన పదజాలాలతో దూషించడం సిగ్గుచేటని అన్నారు గడిచిన 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల అప్పులు చేసి, పర్సంటేజ్ లతో దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా మీరు, మీ అలవాట్లు , మీ పదజాలం మారకుంటే, నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురి కావడం తప్పదని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking