ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా. పుట్ట శ్రీనివాస్
వేములపల్లి, అక్షిత న్యూస్ :
వేములపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లావైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పుట్ట శ్రీనివాస్ ఆకస్మిక తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డులను పరిశీలించి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేయాలని, జాతీయ, రాష్ట్ర స్థాయి హెల్త్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిబి నియంత్రణ అధికారి డా.కళ్యాణ్ చక్రవర్తి, మిర్యాలగూడ, నల్లగొండ, ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా.గీతావాణి, డా.వేణుగోపాల్ రెడ్డి, సుచరిత వైద్య ఆరోగ్యశాఖశాఖ సిబ్బంది పాల్గొన్నారు.