*ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే దంపతులు*
*- ప్రజలందరూ భక్తి భావాలను పెంపొందించుకోవాలి*
*- ఎమ్మెల్యే వేముల వీరేశం*
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ ప్రజల ఆచారాల్లో ప్రధానమైన అంశమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.గురువారం మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారు బోనాల పండుగ సందర్భంగా వీధులలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి వేముల పుప్పక్క తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రజలంతా ఐక మత్యంతో పండుగలు నిర్వహించుకోవాలన్నారు.గ్రామాలను సుభిక్షంగా ఉండేటట్లు గ్రామదేవతలు కాపాడుతారనే నమ్మకంతో గ్రామ పొలిమేరలో గ్రామదేవతలను నాటి సమాజం ఏర్పాటు చేసుకున్నారని ఆ విశ్వాసంతోనే నేడు సమాజం సుఖ సంతోషాలతో ఉందన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండి,ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి పూస బాలమణి బాలనర్సయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూస బాలకిషన్,సిరిగిరెడ్డి మల్లారెడ్డి,గంగుల రాజిరెడ్డి, పున్న జగన్మోహన్,నంద్యాల బిక్షం రెడ్డి, గుత్త నర్సిరెడ్డి, పెద్దగోని వెంకటేశం,కాటెపల్లి యాదయ్య,ఎర్ర సత్యనారాయణ, కేస సందీప్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు, గ్రామ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.