ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

* తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్
*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సేవా దృక్పథంతో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయవాది, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కోరారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (టీహెచ్ సీఏఏ) , గ్లెన్ ఫీల్డ్ మల్లారెడ్డి బ్రెయిన్ హార్ట్ హాస్పిటల్ – హైదారాబాద్ వారు సంయుక్తంగా హైకోరు ప్రాంగణంలో మెగా హెల్త్ క్యాంపు ను నిర్వహించారు. ఈ క్యాంపు లో హమీద్ షేక్ పాల్గొని మాట్లాడారు.

న్యాయవాదుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అహర్నిశలు ఆలోచిస్తోందని, ఆ దిశగా కృషి చేస్తోందని కితాబిచ్చారు. నిత్యం పని ఒత్తిడిలోనే నిమగ్నమయ్యే న్యాయవాదులంతా వారి యొక్క ఆరోగ్య సంరక్షణపై ప్రతేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆహార నియమాలను తూచా తప్పకుండా పాటించడంతో పాటుగా కొంతసమయాన్ని వ్యాయామం కోసం కేటాయించాలని కోరారు.

తెలంగాణ హైకోర్టులో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన మెడికల్ ఫీల్డ్ మల్లారెడ్డి బ్రెయిన్ హార్ట్ హాస్పిటల్ యాజమాన్యానికి, హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన టీహెచ్ సీఏఏ అధ్యక్షుడు ఏ.రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు శాంతి భూషణ్ రావు, సంజీవ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి, కోశాధికారి కట్టా శ్రావ్య, ఇతర సభ్యులకు హమీద్ షేక్ ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking