ప్రాణ త్యాగాలకు ప్రతిఫలం

ప్రాణ త్యాగాలకు ప్రతిఫలం

మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిల తోడ్పాటుతోనే వర్గీకరణ

మొదటి నుంచి కాంగ్రెస్ అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల కేటాయింపులో మాదిగలకు మోసం

మాదిగ అమరవీరుల
త్యాగం వెలకట్టలేనిది

వర్గీకరణ తీర్పును వ్యతిరేకించి మాలలు సమాజం ముందు దోషిగా నిలబడొద్దు

వర్గీకరణను అమలుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని త్వరలో కలుస్తా

ఎస్సీల్లో క్రిమిలేయర్ అమలు చేయాల్సి వస్తే మాయావతి, రామదాసు అథవాలే, ప్రకాష్ అంబెడ్కర్, రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబాలకు వర్తింపజేయాలి

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలంటూ గత 30 ఏళ్లుగా జరిగిన పోరాటానికి దేశ ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిల సహకారం వల్లనే వర్గీకరణ సాధ్యమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగకు శ్రేణులు కొనసాగతం పలికారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ ప్యాట్నీ సెంటర్ ట్యాంక్బండ్ మీదుగా విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి బషీర్బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, ప్రొఫెసర్ కాశీంలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలను పొందేందుకు 30 ఏళ్ల పట్టుకున్న సైన ఉద్యమంలో సమాజంలో అన్ని వర్గాల అండ ఉండడంతోనే వర్గీకరణ సాధ్యమైంది అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాల సామాజిక వర్గం సమాజం ముందు దోషిగా నిలబడొద్దన్నారు.

తరతరాలుగా వర్గీకరణ ఫలాలందుతూ అన్ని రంగాలలో లబ్ధి పొందిన మాల సామాజిక వర్గంకు చెందిన నేతలు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాయన్నారు. మాదిగలకు సాక్షాత్తు దేశ ప్రధాని అండగా ఉన్నారని, అన్ని రాష్ట్రాలలో వర్గీకరణ అమలు చేయించుకునే పనిలో ఉంటానని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ బహిరంగ వేదికల మీద ప్రకటించాలని డిమాండ్ చేశారు.

భావోద్వేగానికి గురైన మందకృష్ణ

ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరించాలని పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ నివేదికపై ఒక్కసారిగా మంద కృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిప్పారపు లక్ష్మణ్, తమిళనాడు అధ్యక్షుడు లోకేష్, కర్ణాటక అధ్యక్షుడు నరసప్పతో పాటు ఏపీ తెలంగాణ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking