బిఅర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో
సంపూర్ణ రైతు రుణ మాఫీ కొరకై ఎం అర్ ఓ కువినతి పత్రం….
నంగునూర్, అక్షిత ప్రతినిధి:
నంగునూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట యం యల్ ఏ
తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు నంగునూర్ మండల కేంద్రం లో
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ సంపూర్ణ రైతు రుణమాఫీ కోసం రైతులతో కలసి నంగునూర్ లో బి అర్ ఏస్ పార్టీ ఆధ్వర్యంలోపెద్ద ఎత్తున్న ధర్నా చేశారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే సంపూర్ణ రైతు రుణమాఫీ కోసం చెయ్యాలని రైతులతో కలిసి నంగునూర్ మండల ఏంఆర్ఓ వినతి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎలాంటి ఆంక్షలు పెట్టని ప్రభుత్వం రేషన్ కార్డు లేదని ఇంట్లో ఉద్యోగం ఉందని నానా ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీ చేయడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు.
ఈ కార్యక్రమంలో : నంగునూర్ మండల రైతులు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు అన్నీ గ్రామల పార్టీ అధ్యక్షులు,యూత్, విద్యార్థి నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.