అడ్మిషన్లకు మరో ఛాన్స్…!
మూడు రోజులే అవకాశం..!!
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు మరో సారి అవకాశం కల్పించినట్లు చెన్నైపాలేం ఉన్నత పాఠశాల ప్రదానోద్యాయులు, ఓపెన్ స్కూల్ సొసైటీ చెన్నైపాలెం కో ఆర్డినేటర్ ఉమ్మడి సైదిరెడ్డి, సహాయ కోఆర్డినేటర్ మాలోత్ దశరథ్ నాయక్ లు తెలిపారు. ఆదివారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ చదువు మధ్యలో మానివేసినవారు పదవ తరగతికి దరఖాస్తు చేసుకోవచ్చని, పది పాసైన వారు ఇంటర్ ఒక్క సంవత్సరంలో పూర్తి చేసుకునే అవకాశం వున్నదని చెప్పారు. ఈ అవకాశం మళ్ళీ రాదని ఈనెల 9నుండి 11 వరకు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉన్నదని కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నందున అడ్మిషన్స్ కావాలనుకునేవారు వెంటనే సంప్రదించాలని వారు కోరారు.పదవ తరగతి అడ్మిషన్స్ కోసం రికార్డ్ షీట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటో, సమర్పించాలని,ఇంటర్ అడ్మిషన్ల కోసం పదవ తరగతి టీసి, పదవ తరగతి మెమో,కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఫోటోతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9849573645, 8555917912 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.