ఓపెన్ అడ్మిషన్లు ప్రారంభం
ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
వివిధ కారణాలతో చదువు మధ్యలో మానివేసిన వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైట్(TOSS)ఆధ్వర్యంలో నిర్వహించబడే ఓపెన్ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని ఆసక్తి,అవసరం వున్నవారు అడ్మిషన్లు పొందాలని చెన్నైపాలెం ఉన్నత పాఠశాల కో ఆర్డినేటర్, సహాయ కో ఆర్డినేటర్లు ఉమ్మడి సైదిరెడ్డి, మాలోత్ దశరథ్ నాయక్ లు తెలిపారు.చదువు మధ్యలో మానివేసిన వారికి ఇది వరమని వెంటనే అడ్మిషన్లు తీసుకొని కోర్సులు పూర్తి చేసుకోవాలని సూచించారు.ఓపెన్ పదవ తరగతి అడ్మిషన్ల కోసం వారు చదివిన రికార్డు షీట్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం,ఫోటో సమర్పించాలని, ఇంటర్ అడ్మిషన్ల కోసం పదవ తరగతి పాస్ మెమో (memo), టీసీ, కులదృవీకరణ పత్రం,ఆధార్ కార్డు,ఫోటో తో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. ఇంటర్ కోర్సు ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.వివరాలకు చెన్నైపాలెం ఉన్నత పాఠశాలలో సంప్రదించాలని లేదా 9849573645, 8555917912 పోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.