భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మంలో ఘనంగా జిల్లా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం

 

వంద శాతం విద్యార్థులు భాష ఉత్తీర్ణతలు అయ్యేటట్లుగా కృషి చేస్తాం

-రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు

ఖమ్మం /అక్షిత బ్యూరో :

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్ యు పిపి ) తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగం రాష్ట్ర అధ్యక్షుడు చింతకుంట జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహులు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ హాజరై భాషా పండితుల ప్రమోషన్ గురించి మాట్లాడుతూ జిల్లాలో తెలుగు 228 పోస్టులు 205 హిందీ పోస్టులు ప్రమోషన్లు వచ్చాయి.అందుకు భాషా పండితులకు ఖమ్మం డిఈఓ మరియు రాష్ట్ర నాయకులు మరియు అధ్యక్షులు ప్రమోషన్స్ వచ్చిన వారిని ఈ కార్యక్రమంలో సన్మానించారని తెలిపారు.ఆర్ యు పి పి టి ఎస్ నాలుగు దశాబ్దాల కల నెరవేరిన సందర్భంగా భాషా పండితులకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ 100% విద్యార్థులు భాష ఉత్తర్ణతలు అయ్యేటట్లుగా కృషి చేస్తామన్నారు.ప్రమోషన్స్ ఎప్పుడో రావాలి కానీ గత ప్రభుత్వం కాలయాపన చేసి భాషా పండితులకు మొండి చేయి చూపించిందని అన్నారు.ప్రస్తుత ప్రభుత్వం విద్యాభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10,479 పోస్టులు భాష పండితులకు ప్రమోషన్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అని అన్నారు. కావున భాషా పండితులకు ఇది ఒక వరం అని చెప్పవచ్చు అని తెలియజేశారు.భాషా పండితుల కల నెరవేరిన సందర్భంగా భాషా పండితులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షులు వైకుంఠపు ఉమాదేవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలగందుల సుచరిత రాష్ట్ర కార్యదర్శి భూక్య హరి ఆర్ యు పి టి ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్ పాపాలాల్ మాతృ భాస్కర్ బాల్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking