యాదాద్రిలో తెలంగాణ నూతన గవర్నర్
యాదాద్రి భువనగిరి, అక్షిత బ్యూరో :
తెలంగాణ నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు గవర్నర్ కు పూర్ణకుంభంతో ఆలయంలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రి ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి మూడు రోజులపాటు పర్యటనలో భాగంగా.. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ రోజు గవర్నర్ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు రోడ్డు మార్గంలో గవర్నర్ ములుగు చేరుకుంటారు. అక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో రెస్ట్ తీసుకుని.. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా అధికారులను పరిచయం చేసుకుంటారు.