ఫాక్స్ సాగర్ పై హైడ్రా నజర్
ఫాక్స్ సాగర్ అక్రమ నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాధ్
అక్రమనిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిక
మేడ్చల్, అక్షిత బ్యూరో :
కబ్జా దారుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. చెర్వులు, కుంటలు ఆక్రమించి భారీ భవంతులు కట్టిన కబ్జా రాయుళ్ళకు హైడ్రా ముచ్చెమటలు పట్టిస్తోంది. రాజకీయాలు, సెలబ్రిటీలు తదితరులు ఎంతటి ఉన్నత స్థితి ఉన్నప్పటికీ కబ్జా చేస్తే ఆయా భవంతులను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే చాలా భవంతులను నేలమట్టం చేసి దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా హైద్రాబాద్ నలుమూలల దృష్టి సారిస్తుంది.

హైడ్రా దూకుడుతో కబ్జాదారుల గుండెల్లో దడపుడుతుంది. ఎప్పుడు ఎక్కడ నుండి వచ్చి పడుతారో తెలియక కబ్జాదారులు హడలిపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా ఇటీవల వార్తల్లో నిలిచిన హైడ్రా ఐపీఎస్ ఏవి రంగనాధ్ నేతృత్వంలో నగర శివారు ప్రాంతాలతో పాటు, నగరంలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో వందలకొద్ది అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ క్రమంలో మంగళవారం రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కొంపల్లి మున్సిపాలిటీలోని ఫాక్స్ సాగర్ బఫర్ ఉమామహేశ్వర కాలనీలోని కబ్జాకు గురైన ప్రాంతాలను హైడ్రా కమీసనర్ ఏవి రంగనాధ్ వారం రోజుల్లో రెండవ సారి సందర్శించి అధికారుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం మాల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఫాక్స్ సాగర్ చెరువును రెండు సార్లు సందర్శించి వివరాలు సేకరించడంతో త్వరలో మూడు శాఖల అధికారులతో మరో మారు సమావేశం అనంతరం భారీగా కూల్చివేతల వుంటాయని ప్రచారం జరుతుంది. ఈ కార్యక్రమంలో దుండిగల్ మండల తగశీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్, ఇరిగేషన్ ఏఈ సారా, రామారావు, కొంపల్లి మున్సిపల్ కమీషనర్ శ్రీ హరి,సిబ్బంది పాల్గొన్నారు.