దర్జాగా పుట్ పాత్ ఆక్రమణ

దర్జాగా ఫూట్ పాత్ ను ఆక్రమించి అక్రమ పార్కింగ్..

కబ్జాతో కనుమరుగవుతున్న ప్రజాప్రయోజన స్థలంలో దర్జాగా పార్కింగ్..

పట్టించుకోని మున్సిపల్ అధికారులు,జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు..

మేడ్చల్, అక్షిత బ్యూరో :  ఫూట్ పాత్ స్థలం ఆక్రమించి ప్రజా ప్రయోజన స్థలాలు పై.అధికారులు కన్నెత్తి చూడడం లేదు, పార్క్.స్థలాలను, ప్రజా ప్రయోజన స్థలాలను దర్జాగా కబ్జా…దుండిగల్ పురపాలక పరిధి లో నర్సాపూర్ ప్రధాన రహదారి లో పిస్తా హౌస్ నిర్వాహకుడు ఏకంగా ఫూట్ పాత్ ను ఆక్రమించి పార్కింగ్ ఏర్పాటు చేయడంతో వాహనదారులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు.ఫూట్ పాత్ ను ఆక్రమించి పార్కింగ్ ఏర్పాటుచేసిన మున్సిపల్ అధికారులు, అటు జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు,పాత చారులు విమర్శిస్తున్నారు.టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నా వారంలో మూడు రోజులు మాత్రమే విధులకు హాజరవుతు ఆఫీస్ లో ఫైళ్ళకే పరిమితం అవుతుండడంతో దుండిగల్ పురపాలక లో అక్రమనిర్మాణాలు జోరుగానే పుట్టగొడుగుల్లాగా వెలుస్తున్న నిర్మాణాలపై చర్యలు మాత్రం శూన్యం..

తరచూ ప్రమాదాలు 

హోటల్ దందా కోసం పచ్చటి చెట్లను తొలగించాడు
పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం హరితహారం, వనమహోత్సవం అంటూ లక్షల రూపాయలు ఖర్చు చేసి రోడ్లపై చెట్లను ఏర్పాటు చేశారు. వీటిని సంరక్షించాల్సిన ప్రజలు వ్యాపారస్తులు వారి స్వార్థానికి చెట్లను తొలగిస్తున్నారు. పిస్తా హౌస్ హోటల్ నిర్వాహకులు ఫుట్ పాత్ పై ఉన్న చెట్లను తొలగించి ఫుట్పాత్ను పార్కింగ్ గా వాడుకోవడం ఏమిటి అని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి

జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ మీడియాకు వివరణ

నర్సాపూర్ రహదారిపై నర్సాపూర్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న పిస్తా హౌస్ హోటల్ ఫుట్పాత్ ను ఆక్రమించి పార్కింగ్ రోడ్డుపైన ఏర్పాటు చేశారని ట్రాఫిక్ సీను వివరణ కోరగా సిఐ మాట్లాడుతూ పిస్తా హౌస్ కు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి లేదన్నారు.

హోటల్ నిర్వాహకులు పార్కింగ్ కోసం సిపి కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే తమకు కాపీ వస్తుందని ఇప్పటివరకు అలాంటిదేమీ రాలేదని తెలిపారు. పిస్తా హౌస్ ప్రారంభోత్సవం తర్వాత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని యాక్సిడెంట్ ప్రో ఏరియాలో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ బి.శ్రీనివాస్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking