ఎదిగినోళ్ళ వద్దే అన్నీ గుప్తం
ఫలించిన…ముప్పై ఏళ్ల పోరు
వర్గీకరణ మేరకే గ్రూప్ ఫలితాలివ్వాలి
సీఎం రేవంత్ రెడ్డిని కలిశాం
•’మీట్ ది ప్రెస్’లో మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రిజర్వేషన్ల ఫలాలతో ఎదిగినోళ్ళ వద్దే అన్నీ గుప్తమయ్యాయి. ఉద్యోగ, ఆర్ధిక రాజకీయ పలుకుబడి నిక్షిప్తమయ్యాయి. ప్రభుత్వ రంగాలు నిర్వీర్యమవుతుంటే నోరు మెదపట్లే. ఉన్న రిజర్వేషన్లతో గుప్పెడు మంది హస్తగతం చేసుకుని సంపన్నులుగా… స్థితి మంతులుగా ఎదిగి ప్రైవేట్ కంపెనీలు పెట్టుకుని దర్జాగా బతుకీడ్చుతుండ్రు. ఫలాలు అందనోళ్ళు దౌర్భాగ్య స్థితిలోనే ఉండ్రు. ముప్పై ఏళ్ల ఉద్యమ ఫలితంగా ఎట్టకేలకు దేశ అత్యున్నతన్యాయస్థానం ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు పచ్చ జెండా ఊపి చారిత్రాత్మక తీర్పునివ్వడంతో పాటు జస్టిస్ గవాయి క్రిమిలేయర్ సూచించారు. దీంతో 100 ఎంపీలు దేశ ప్రధాని మోడీని కలిసి క్రిమిలేయర్ నిర్ణయం వద్దంటూ తెగేసి చెప్పడం విస్మయం కల్గించిందని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.

కనీసం దానికి ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ ఫలాలు అందుకుని ఉన్నత స్థితికి చేరిన వారికి కట్ ఆఫ్ మార్క్స్ వద్ద చిన్న తేడా ఉంటే మిగిలిన కులాలకు ఫలాలు అందే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. తాను మాత్రం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్రిమిలేయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తునన్నారు.

ఎదిగిన కులాల చేతుల్లోనే పార్లమెంట్ ఉందని, ఇటీవల 100 మంది ఎంపిలు ప్రధానిని కలిసి వర్గీకరణ విషయంలో ఏలాంటి నిర్ణయo తీసుకోరాదని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఎదిగిన దళిత, గిరిజనులు పార్లమెంట్లో ఉంటే ఎదగని కులాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అధ్యక్షతన ‘మీట్ ది ప్రెస్’ జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వర్గీకరణను వీలైనంత త్వరగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశామని, ఆయన అంగీకరించి ఒక్కసారి ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవాలని నూచించారని, ఎందుకు కలవమన్నారో తమకు అర్థమవ్వ లేదన్నారు. సుప్రీం తీర్పుతోనే తొలుత సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని, ఆర్డినెన్సు తెస్తామని చెప్పారని, ఆ మేరకు త్వరగా అమలు చేయాలని తనతో పాటు మంత్రి దామోదర్ రాజనర్సింహ బృందంతో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.

గ్రూపు-1 ఫలితాలు వర్గీకరణ ప్రకారం ప్రకటించాలని, ఈ విషయంపై పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను కలుస్తా మన్నారు. వర్గీకరణ కోసం పలు రాష్ట్రాల్లో నియమించిన ఏ కమీషన్ కూడా వర్గీకరణను వ్యతిరేకించలేదని, న్యాయ వ్యవస్థ న్యాయబద్ధంగా నిలబడిందని, డబ్బు, రాజకీయం, మీడియా ఉందని చూస్తే పనిచేయలేదని సమాజం ఆలోచించిందన్నారు. దేశంలో ఎక్కడ జరగని విధంగా వర్గీకరణ ఉద్యమం మూడు దశాబ్ధాల పాటు కొనసాగిందని, చిట్టచివరికి విజయం సాధించామని, ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని, సమాజం కూడా అన్ని విధాల సహకరించిందన్నారు. బిసిలలో వర్గీకరణ ఉన్నప్పుడు ఎస్సీల్లో వర్గీకరణ ఎందుకు ఉండకూడదనే పట్టుదలతో వర్గీకరణ ఉద్యమానికి అంకురార్పణ జరిగిందన్నారు. వర్గీకరణ ఉద్యమంతో పాటు ఎంఆర్పిఎస్ అన్ని వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్, పాలకుల వేతనాలు పెంచాయని, కాని వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పెన్షన్ పెంచలేదని, తమ పోరాటాల ఫలితంగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలు చేసి విజయం సాధించిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు రాష్ట్ర బడ్జెట్ పాలకుల వేతనాలు పెంచాయని, కాని వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పెన్షన్ పెంచలేదని, తమ పోరాటాల ఫలితంగా నేడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆరు వేలకు పెరిగాయని, ఆరోగ్యశ్రీ తమ ఉద్యమం ద్వారానే వచ్చిందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రియాంకారెడ్డి ముటనపై రాజకీయాలకు ప్రతి ఒక్కరూ స్పందించి, ప్రభుత్వం నలుగురు యువకులను ఎన్కౌంటర్ చేసిందని, ఆ ఘటనకు ముందు వరంగల్, ఆదిలాబాద్, ప్రస్తుత మేడ్చల్ జిల్లాలోని హజిపూర్లో అమ్మాయిలపై జరిగిన అత్యాచారం, హత్యలపై ఏ ఒక్కరూ స్పందించలేదని ఆరోపించారు. తాము ఉద్యమించడం వల్లనే రాష్ట్రంలో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని కృష్ణమాదిగ తెలిపారు. మాదిగలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు దక్కడం లేదని, మాల సోదరులు వర్గీకరణను అడ్డుకుంటున్నారని, వర్గీకరణను అడ్డుకుంటే తిరిగి రోడ్లమీదకు వచ్చి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ మీట్ ది ప్రెస్ లో టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఐజేయూ జాతీయ కార్యదర్శి వి.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు రాజేష్, హెచ్ యూజే అధ్యక్షులు శిగ శంకర్ గౌడ్, చిన్న మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి యాతాకుల అశోక్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఎంజేఎఫ్ జాతీయ అధ్యక్షులు దాస్ మాతంగి, ఎంజేఎఫ్ జాతీయ కో ఆర్డినేటర్ తిప్పారపు లక్ష్మణ్, ఎంఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, ఎంజేఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సుoచు అశోక్, ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్, రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.