సీఎంఆర్ లక్ష్యాన్ని అధిగమించాలి

*గడువులోగా*
*సియమ్ఆర్ పూర్తి చేయాలి 

*లక్ష్యం పూర్తి చేసిన వారికే వచ్చే ఖరీప్ లో ధాన్యం కేటాయింపు..*

*సి.యమ్.ఆర్. బకాయిలు చెల్లించని యాజమాన్యం పై చర్యలు తప్పవు..*

*జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్*

*సూర్యాపేట, అక్షిత బ్యూరో :

గడువులోపు సి.యమ్.ఆర్. లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం నందు అదనపు కలెక్టర్ బి. ఎస్. లత తో కలిసి సివిల్ సప్లై అధికారులతో మిలర్ల యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023 – 24 ఖరీఫ్, రబీ సీజన్ లక్ష్యాలను సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. గతంలో సి. యమ్. ఆర్.చెల్లించని వారిపై అలాగే నిర్లక్ష్యంవహించిన మిల్లర్లపై రెవిన్యూ రికవరీ యాక్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సి. యమ్. ఆర్.పెండింగ్ బకాయిలపై సివిల్ సప్లయ్ అదికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.మిల్లర్లు అందరు ఎ, బి రిజిస్టర్లు నిర్వహించాలని ప్రత్యేక బృందాల ద్వారా మిల్లులను పర్యవేక్షిస్తున్నట్లు ఎక్కువ పెండింగ్ ఉన్న మిల్లర్లు మూడు షిప్ట్ లలో మిల్లులు నడిపించి సి. యమ్. ఆర్. ఉత్పత్తి చేయాలని,రోజు వారి సి.యమ్. ఆర్. డెలివరి రిపోర్ట్ ని తమకు పంపించాలని అధికారులకు సూచించారు.వచ్చే ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కేటాయింపు పారదర్శకంగా ఉంటుందని సి. యమ్. ఆర్.లక్ష్యం పూర్తి చేసిన మిల్లర్లకే ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్ తెలిపారు.అంతకుముందు అదనపు కలెక్టర్ బి ఎస్ లత మిల్లులలో పెండింగ్ ఉన్న 2023-24 ఖరీఫ్ రబీ సీజనలకి సంబంధించిన
సి.యమ్.ఆర్. ని చదివి వినిపించారు.
ఈ సమావేశంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డి.యం. టి యన్ ఎస్ ప్రసాద్,ఏ.సీ.ఎస్.ఓ. శ్రీనివాస్ రెడ్డి,సివిల్ సప్లై డి. టి. లు రాజశేఖర్ రాంరెడ్డి, నాగలక్ష్మి, విజయశేఖర్ మిలర్ల యాజమాన్యం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking