పిఎసి చైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే గాంధీ కీ సత్కారం..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నూతనంగా ప్రజాపద్దుల చైర్మన్ గా నియామకమైన ఎమ్మెల్యే అరకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి సాలువతో సత్కరించి అభినందనలు తెలియజేసిన కొండాపూర్ డివిజన్ యువజన నాయకులు అక్షయ్ పటేల్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని , ప్రజల మనిషిగా, పనిమంతుడు గా ప్రాచుర్యం పొంది శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడిగా ఎమ్మెల్యే గాంధీ ముద్రించబడ్డారని అక్షయ పటేల్ ఈసందర్భంగా వారి విశిష్ఠ సేవలను కొనియాడారు.