డప్పు కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి

డప్పు కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి

పౌరాణిక, డప్పు కళాకారుల బృందం కెప్టెన్ బొడ్డు బొందయ్య

ఖమ్మం /అక్షిత బ్యూరో :

డప్పు కళాకారులను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని పౌరాణిక మరియు డప్పు కళాకారుల బృందం కెప్టెన్ బొడ్డు బొందయ్య కోరారు. నిన్న ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో గత పది సంవత్సరాలుగా డప్పు కళాకారులుగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర జిల్లాలకు కూడా ప్రజాప్రతినిధులకు సామాజిక కార్యక్రమాలకు డప్పు ప్రదర్శనలు చేస్తున్నాము. ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సహకాలు మరియు గుర్తింపు లేకపోవడం వలన అభివృద్ధికి నోచుకోలేదు.

ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గ్రామీణ కళాకారులను గుర్తించి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో ప్రాధాన్యత కల్పించాలని డప్పు కళాకారులను గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులు ఎండ్రాతి కృష్ణ
బొడ్డు వెంకటేశ్వర్లు తోళ్ల ఉసేన్
ఎండ్రాతి బాబు వేముల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking