రుణ మాఫీపై రైతు జేఏసీ
మీడియా సమావేశం
– 15 చివరి తేదీ 16 న ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
– మూడు నియోజకవర్గ రైతులకు పిలుపునిచ్చిన జేఏసీ
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి :
రైతు ఐక్య కార్యచరణ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఎమ్ఆర్ గార్డెన్స్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విదంగా షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలనీ రైతు భరోసా 7500 రూపాయలు ఇవ్వాలని గత నెల24 తారీఖున చేపట్టిన నిరసన కార్యక్రమంలోరైతు జేఏసీ రైతుల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ 15 వరకు గడువు ఇవ్వడం జరిగింది. కానీ సెప్టెంబర్ 12 తారీఖు వచ్చిన కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. రైతు భరోసా యాప్ ల పేరున తెల్ల రేషన్ కార్డు లేని రైతుల రైతు కుటుంబాలనునిర్దారించడం జరుగుతుంది కానీనేటి వరకుకేవలం55శాతం రైతు కుటుంబాలను నిర్దారించినట్టుగా అధికారులు చెపుతున్నారు. మిగతా వారు బతుకు దెరువు కోసం విదేశాలకు వెళ్లిన వారు. దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేస్తున్న వారుభార్య చనిపోతే భర్త ,భర్త చనిపోతే భార్యలాంటి రైతు కుటుంబాల కుటుంబ నిర్దారణకు ఆ యొక్కయాప్ లోఅవకాశంలేదు మరి వీరిసంగతి ఏంటిఅని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము ముఖ్యంగా రెండులక్షల పైన అప్పు వున్న రైతుల సంగతిఏంటి అని అడుగుతున్నాము
ప్రభుత్వం ఇప్పటివరకు కూడాఇలాంటి
సమస్యలకుతగువిధమైన గైడ్లైన్స్ఇవ్వకపోవడం కుటుంబ నిర్దారణ అయిన రైతులకన్నారుణ మాఫీచేయకపోవడం నిరసిస్తూ ఈనెల16తారీఖున అన్ని మండల కేంద్రాలలోతహశీల్ధార్ఆఫీసుల ముందరధర్నాకార్యక్రమానికిపిలుపుఇవ్వడం జరిగింది అప్పటికి ఇంకా ప్రభుత్వం దిగి రాక పొతే ఎలాంటి ఉద్యమానికైనా వెనుకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అనితెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్య చరణ కమిటీ సభ్యులు ఇట్టడి లింగారెడ్డి, నూతుల శ్రీనివాస్, దేగాం యాదాగౌడ్, దేవరాం, సుక్కిసుధాకర్, తిరుపతిరెడ్డి, అల్లూరి గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.