తక్కువ ధరలకే…
నచ్చిన వస్త్రాలు
సొంత మగ్గాలపైనే
వస్త్రాల తయారీ
సీఎంఆర్ లోనే
ప్రపంచ స్థాయి అనుభూతి
ది వన్ స్టాప్ షాప్…సీఎంఆర్
సినీ హీరో విశ్వక్ సేన్
సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకట రమణ
మేడ్చల్, అక్షిత బ్యూరో :
తక్కువ ధరలకే కుటుంబమంతటికి నచ్చే… మెచ్చే వస్త్రాలు సీఎంఆర్ లో అందుబాటులో ఉంటాయని సినీ హీరో విశ్వక్ సేన్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ లో 34వ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో ప్రపంచ స్థాయి అనుభూతి సీఎంఆర్ లోనే సాధ్యమన్నారు.ఇంటిల్లిపాదికి అవసరమైన… నచ్చిన… పేరెన్నిక కల్గిన వస్త్రాలు సీఎంఆర్ లో అత్యంత తక్కువ ధరలకు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. 40 ఏళ్ల వస్త్ర వ్యాపార రంగంలో అనుభవం గడించిన సీఎంఆర్ క్వాలిటీకి, డిజైన్స్ ల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో అగ్ర గామిగా నిలుస్తుందన్నారు. సీఎంఆర్ ఫౌండర్, చైర్మన్ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థగా సీఎంఆర్ టెక్స్ టైల్స్ అండ్ జ్యూయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వెలుగొందు తుందన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో 33 షోరూంలతో వస్త్ర ప్రియులకు చేరువ కాగా తెలంగాణలో మరో షోరూoగా మేడ్చల్ బస్టాండ్ కు ఎదురుగా మరో సీఎంఆర్ షాపింగ్ మాల్ ను సినీ హీరో విశ్వక్ సేన్ చేతుల మీదుగా ప్రారంభించు కోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రజలకు మెచ్చిన… నచ్చిన అన్ని మోడల్స్ అన్ని వేడుకలకు అనుగుణంగా అత్యంత తక్కువ ధరలకే విక్రయించడం సీఎంఆర్ ప్రత్యేకతగా పేర్కొన్నారు. సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరు ఇవ్వని ధరలకు సీఎంఆర్ అందిస్తూ కస్టమర్ల మనసును హస్తగతం చేసుకుంటుంద న్నారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ మాచే నూతనంగా 34వ షోరూం మేడ్చల్లో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

ది వన్ స్టాప్ షాప్ …సీఎంఆర్ కుటుంబమంతటికి నచ్చిన… మెచ్చిన అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లు లభిస్తాయని, లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు తమ వద్ద అందరికి అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు. సినీ హీరో విశ్వక్ సేన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, అన్ని సెక్షన్లు కలియ తిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించారు. ఎన్నో రకాల కలెక్షన్స్ చూసి, తాను షాపింగ్ చేయడం జరిగింది. విశ్వక్ సేన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి రాగా, తాను కొనుగోలు చేసిన వస్త్రాలను గిఫ్ట్ గా ఇచ్చి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు.


సీఎంఆర్ అంటే కంప్లీట్ షాపింగ్ మాల్ గా అభివర్ణించి కుటుంబమంతటికి అవసరమైన అన్ని రకాల వస్త్రాలు… తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయని విశ్వక్ సేన్ అభిమానుల కోలాహాలం నడుమ ఎంతో అట్టహాసంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. అభిమానులతో సెల్ఫీలు దిగి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపారు.

ఆది నుంచి అంతం వరకు సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభ ప్రక్రియ సీని హీరో విశ్వక్ సేన్ రాక మేడ్చల్లో సందడిని తలపించింది.ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్ మేనేజర్ కే. ఫణి, సాకేత్ తదితరులు పాల్గొన్నారు.