జై జై గణేశా
జై జై గణేశా
భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు
ఆట పాటలతో చిన్నారుల సందడి
మన్సురాబాద్, అక్షిత న్యూస్ :
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అయోధ్య రామాలయ బాల రాముడు, విఘ్నేశ్వరు డికి భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలందుకుంటుండ్రు. ప్రతిష్ఠాత్మకంగా ప్రతిష్టించిన రోజు నుంచి నిత్యం భక్తులు పూజలు చేయడం… ఆట పాటలతో చిన్నారుల సందడి కోలహాలాన్ని తలపిస్తుంది. మన్సురాబాద్ లోని హిమపురి కాలనీలో హిమపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యoలో
అయోధ్య రామాలయ బాల రాముడు, విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు.
ఈ నెల 15న ఆదివారం అన్నదాన వితరణ, తదుపరి లడ్డు వేలం, నిమజ్జన భారీ ఊరేగింపు ఉంటుందని భక్తులు హాజరై ఆయా వేడుకల్లో భాగస్వామ్యులై దైవ కృపకు పాత్రులు కావాలని హిమపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జే.రాములు, అసోసియేషన్ నేతలు కే.సత్యనారాయణ, చెన్నోజు రవి కిరణ్, జగదీశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు కోరారు.
ఆట పాటలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆకట్టుకుంటున్నాయి.