కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలి 

కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలి 

– జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన సాంస్కృతిక సేన కళాకారులు

సూర్యాపేట , అక్షిత బ్యూరో :

నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని సాంస్కృతిక సేన కళాకారులు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కి విజ్ఞప్తి చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు.అనంతరం కళాకారులు మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించి,సారధి కళాకారులతో పాటు కళనే నమ్ముకుని జీవనం గడుపుతున్న సాంస్కృతిక సేన జిల్లా కమిటీ సభ్యులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో అవకాశం కల్పించాలని కోరారు.వినతి పత్రo అందజేసిన వారిలో టిపిసిసి సాంస్కృతిక సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, ఐఎన్టియుసి తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు కుమార్,సాంస్కృతిక సేన జిల్లా ప్రధాన కార్యదర్శి తడకముల పరశురాం,జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు కందుకూరి రవి,జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సంపతి విష్ణు,జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు గట్టు సతీష్,జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము ఆంజనేయులు,మహిళా ఉపాధ్యక్షులు ఎర్ర రాధిక,రానింగు సరస్వతి, తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతరాజు సురేష్, తిరుమలగిరి మండల అధ్యక్షులు వనగండ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking