తెలంగాణలో మరింత పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు… వివరాలు ఇవిగో!

తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య 800 దాటింది. గత కొన్నిరోజులుగా కరోనా కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 38,122 శాంపిల్స్ పరీక్షించగా, 836 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 443 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 55, రంగారెడ్డి జిల్లాలో 52, కరీంనగర్ జిల్లాలో 35 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 765 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేమీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,17,367 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,08,270 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,986 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మృతి చెందారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking