ట్రై కార్ ఛైర్మన్ గా రాంచందర్ నాయక్


టీఆర్ఐసీఓఆర్ చైర్మన్ గా రాo చందర్ నాయక్ ప్రమాణం
* అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

హైదరాబాద్ నగరంలో మాసబ్ ట్యాన్క్ లోని డీఎస్ఎస్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ (టీఆర్ఐసీఓఆర్) చైర్మన్ గా ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ శనివారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రామ్ చందర్ నాయక్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అభినందనలు తెలిపారు.అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించారు. వారి వెంట నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking