సీఎం కేసీఆర్‌తో 26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు భేటీ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
26 రాష్ట్రాల రైతు సంఘాల నేతలు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. అల్పాహార కార్యక్రమం తర్వాత.. వ్యవసాయం, సాగునీటి రంగం, తెలంగాణ ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని జాతీయ రైతు సంఘాల నేతలు తిలకించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన నిర్వహించే రైతు సదస్సులో రైతు సంఘాల నేతలు పాల్గొంటారు. దేశంలో వ్యసాయరంగంపై నెలకొన్న పరిస్థితులతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతిపై చర్చించనున్నారు. అనంతరం జాతీయ రైతు సంఘాల నేతలతో కలిసి భోజన కార్యక్రమంలో సీఎం కేసిఆర్ పాల్గొననున్నారు. లంచ్ అనంతరం సదస్సు తిరిగి కొనసాగనున్నది.