పరిమళించిన మానవత్వం

మరోసారి మానవత్వం చాటుకున్న ప్రియదర్శిని మేడి

నకిరేకల్, అక్షిత ప్రతినిధి:

బిఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. నకిరేకల్ లో పార్టీ మీటింగ్ ముగుంచుకొని తిరుగు ప్రయాణంలో చిట్యాలకు వెళ్లే క్రమంలో అయిటిపాములలో రోడ్డు ప్రమాదం జరుగగా గమనించి వెంటనే ఆమె కారు దిగి 108 కి కాల్ చేసి అక్కడే ప్రాథమిక చికిత్స చేపించి మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వీరి వెంట జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజీత్,నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,ఉపాదక్షులు పావిరాల నర్సింహ యాదవ్,నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మాధగోని రవీందర్ గౌడ్,నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి ముత్యాల రమేష్,నాయకులు మేడి క్రిష్ణ, మేడి వాసుదేవ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking