వాహనం ఢీ… వ్యక్తి మృతి

రోడ్డుదాటే క్రమంలో ప్రమాదానికి గురి వ్యక్తి మృతి
రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి :
రోడ్డు దాటే క్రమంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేటుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్ర ఆరంఘర్ మెట్రో
క్లాసిక్ గార్డెన్ నుండి బుద్వేల్ వైపు వెళ్లడానికి
రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్న జగత్ సింగ్ (55) ను గుర్తు తెలియని వాహనం డీ కొట్టింది. ప్రమాదంలో బలమైన గాయాలు కావడంతో జగత్ సింగ్ సంఘటన స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుని దుస్తుల్లో లభించిన వివరాలతో జగత్ సింగ్ గ గుర్తించామని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీసీ కెమెర పుటేజీల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking