టిటిడబ్ల్యుజేఏ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రవీందర్ నాయక్

తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రవీందర్ నాయక్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్రంలోని గిరిజన జర్నలిస్టుల సమస్య పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ (TTWJA) రాష్ట్ర అధ్యక్షులు తిరుపతి తెలిపారు. హైదరాబాదులోని గిరిజన విద్యుత్ భవనంలో రాష్ట్ర గిరిజన జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా  తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన ధరావత్ రవీందర్ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి దాదాపుగా 200 మంది జర్నలిస్టులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.ఈసందర్భంగా రవిందర్ నాయక్ మాట్లాడుతూ గిరిజన జర్నలిస్టులు రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారికి సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు కూడా లభించడం లేదని అన్నారు. జర్నలిస్ట్ సంక్షేమంతో పాటు గిరిజన ప్రజల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం తమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీ ప్రకటించడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కమిటీలను ప్రకటిస్తామని వివరించారు. ఈ సందర్భంగా కరోనాతో మృతి చెందిన గిరిజన జర్నలిస్టు చందు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి తామ అండగా ఉంటామని భరోసా కల్పించారు. భవిష్యత్తులో గిరిజన జర్నలిస్టులకు ఏదైనా సమస్యలు ఎదురైతే ఆదుకుంటామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking