దళిత బంధుకు ఎంపిక పట్ల జడ్పీ చైర్మన్ మధుకు పాత్రికేయుల కృతజ్ఞతలు
జయశంకర్ భూపాలపల్లి (కాటారం) , అక్షిత ప్రతినిధి :
రాష్ట్రవ్యాప్తంగా దళితులకు దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసే పథకములో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హామీ ఇవ్వడం పట్ల కాటారం మండల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ కాటారం మండల జర్నలిస్టులకు దళిత బందులో అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల కాటారం ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షుడు,కాటారం సబ్ డివిజన్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు నారమల్ల సారయ్య,ప్రెస్ క్లబ్ కోశాధికారి గంట దేవదాస్,క్లబ్ సభ్యుడు మంత్రి రాజబాబు, పాత్రికేయులు మెండ మల్లయ్య,గజ్జల రాజయ్య ఆదివారం హర్షం వ్యక్తం చేశారు.ఎలాంటి జీతభత్యాలు లేని జర్నలిస్టుల కష్టనష్టాలు, సాధక బాధకాలు దృష్టిలో పెట్టుకొని జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఎస్సీ జర్నలిస్టులకు దళిత బంధు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల దళిత జర్నలిస్టులు జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జర్నలిస్టులకు దళిత బంధు వచ్చే విధంగా సహకారం అందిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ భర్త, టిఆర్ఎస్ యువనేత జక్కు రాకేష్,కాటారం మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీటీసీ తోట జనార్దన్ లకు జర్నలిస్టులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.