*శ్రీనివాస్ కుటుంబానికి అండగా* *ఉంటాం*
*-టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ*

సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దౌల్తాబాద్ మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్, యూనియన్ క్రియాశీలక కార్యకర్త కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి తమ సంఘం అండగా ఉంటుందని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అన్నారు. టీయూడబ్ల్యూజే సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రంగాచారీతో కలసి దౌల్తాబాద్ మండలం దొమ్మాటలో కొల్పుల శ్రీనివాస్ కుటుంబానికి గజ్వేల్ ప్రెస్ క్లబ్, గజ్వేల్ జర్నలిస్టు కాలనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కొల్పుల శ్రీనివాస్ మృతి చెందడం భాధాకరమని, వారి కుటుంబానికి యూనియన్ తరపున, ప్రెస్ క్లబ్ తరపున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. వారితో గజ్వేల్ జర్నలిస్టు కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు సురేందర్, ప్రధాన కార్యదర్శి మధుసూదనరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు జమీల్, నాగవెంకట్ రెడ్డి, బాల్ నర్సయ్య, మచ్చ నర్సింహులు, కిరణ్, మహేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, గ్రామ సర్పంచ్ పూజిత వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ సింహాచలం తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking