*నిబంధనలను పాటించి దాన్యం కొనుగోలు చేయాలి* – డీఎస్ఓ వెంకటేశ్వర్లు
అక్షితప్రతినిధి, వేములపల్లి :
ప్రభుత్వ నిబంధనలను పాటించి దాన్యంకొనుగోలు చేయాలని నల్లగొండ డిఎస్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వేములపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాన్యంకొనుగోలు కేంద్రాల బాద్యులు నిబంధనలకు అనుగుణంగా రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధర చెల్లించాలన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీటి సదుపాయంతోపాటు ఇతర వసతులు కల్పించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డిటి సిఎస్ రామకృష్ణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.