వైభవంగా వెంకటేశ్వరుడి కళ్యాణ ఉత్సవం

ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు

మునుగోడు, అక్షిత ప్రతినిధి:
ఘనంగా శ్రీ వెంకటేశ్వర పద్మావతి అలివేలు మంగ కళ్యాణ మహోత్సవ వేడుకలు మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం బోడంపర్తి గ్రామంలో శుక్రవారం ఘనంగా జరిగాయి ఈ వేడుకలను మంచి కంటి లక్ష్మయ్య చంద్రకళ మరియు వెంకటరమణ, రాణి ల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవారి కళ్యాణ వార్షిక 19వ వేడుకలను నిర్వహించారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు పుర ప్రముఖులు అభిమానులు ఘనంగా కళ్యాణాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం నిర్వాహకులు గ్రామ సర్పంచ్ మంచికంటి రాణి వెంకటరమణ, ఆలయ అర్చకులు ముదివర్తి లక్ష్మి వరప్రసాద్, ప్రధాన అర్చకులు సముద్రాల నరసింహ చారి లు కళ్యాణ వేడుకలను భక్తిశ్రద్ధలతో వేద మంత్రాలతో శ్రీవారి కల్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు చుట్టూరా గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking