మిర్యాలగూడ ఆర్డీఓగా చెన్నయ్య
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ అధికారిగా బి.చెన్నయ్య శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన డిప్యూటి తహసీల్దార్ గా, హుజూరాబాద్ ఆర్డీఓగా, అనంతరం సిద్ధిపేట జిల్లా రెవిన్యూ అధికారిగా పని చేస్తు ప్రభుత్వ సేవలందిస్తు మిర్యాలగూడకు ఆర్డిఓగా బదిలీపై వచ్చారు. కార్యాలయంలో తహసీల్దార్ అనిల్ కుమార్, డిప్యూటి తహసీల్దార్ హాని షరీఫ్, జెఎ జమాల్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.

అదేవిధంగా స్థానిక ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా జర్నలిస్టులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావును నూతన ఆర్డిఓ చెన్నయ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వెంటఎస్పి వెంకటేశ్వర్రావు ఉన్నారు.