క్షౌర రంగంలోకి రిలయన్స్ రావడం అన్యాయం

క్షౌర రంగంలోకి రిలయన్స్ రావడం అన్యాయం
*బిసి సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగం గౌడ్
*నిరసిస్తూ అంబానీ దిష్టిబొమ్మ దగ్ధం
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

క్షౌర రంగంలోకి రిలయన్స్ రావడాన్ని వ్యతిరేకిస్తు బీసీ సంక్షేము సంఘం ఆధ్వర్యంలో నిరసనగా రిలయన్స్ అధినేత అంబానీ దిష్టిబొమ్మను శుక్రవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్న క్షౌర వృత్తిదారుల జీవనాన్ని దెబ్బతీసే విధంగా రిలయన్స్ అంబానీ లాంటి బడా పెట్టుబడిదారీ కార్పొరేట్ కంపెనీలు, కార్పొరేట్ సెలూన్లు ముందుకు రావడం చాలా బాధాకరం. చివరకు సేవా, సంప్రదాయ వృత్తిని కూడా వ్యాపారం చేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ వ్యవస్థ ద్వారా సేవా వృత్తిని వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. లక్షల పెట్టుబడులతో సెలూన్లు, బ్యూటీ ఫార్లర్లు పెట్టడం ద్వారా చిన్న, చిన్న సెలూన్లు, దుకాణాలు దెబ్బతిని లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదముందన్నారు. వీటిని ఏర్పాటు చేయకుండా అరికట్టే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, నాయి బ్రాహ్మణుల (సెలూన్ల) క్షౌర వృత్తి భద్రత కోసం ప్రభుత్వం జీవో జారీ చేయాలని, సెలూన్లు జీవనాధారమైన నాయి బ్రాహ్మణులకు అండగా నిలవాలని, నాయి బ్రాహ్మణుల కులవృత్తి హక్కును ఇతర సామాజిక వర్గ, కులస్తులకు, బడా పెట్టుబడిదారీ కంపెనీలకు, అవకాశం ఇవ్వకుండా, క్షౌర వృత్తిపై, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పేటెంట్ హక్కు కల్పించాలన్నారు. కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదగొని మహేష్ గౌడ్, బెజ్జం జానయ్య, ఫరూక్, కృష్ణ, రమేష్, నాగరాజు యాదవ్, లక్ష్మణ్, రాము, సురేష్, రవీందర్, శంకర్, మురళి, విజయ్ పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking